Swamidas Joins YSRCP: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 1994, 1999లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా స్వామిదాస్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Also: Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం ఇంటికి క్యూ కట్టిన పార్టీలు
ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత ఇస్తే దాన్ని శిరసావహిస్తానన్నారు. అన్ కండీషనల్‌గా పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం గేట్ దగ్గర గంటన్నర నిరీక్షించానని ఆయన చెప్పారు. అవినీతి మచ్చ లేకుండా రాజకీయం చేశానన్నారు. తిరువూరు మా తాతల గడ్డ అని.. గెలిచినా, ఓడినా తిరువూరు ప్రజల కోసం పని చేశానన్నారు.