Varra Ravinder Reddy: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి కడప సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈకేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్ , సుబ్బారెడ్డి లకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని మెజిస్ట్రేట్ పోలీసులకు తెలిపారు. అర్దరాత్రి రెండు గంటల సమయంలో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కేసుకు […]
వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. టీడీపీ- జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీ ది 10 శాతం కూడా లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా.. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలనా అంటూ ప్రశ్నించారు.
ఈ బడ్జెట్ గత ఐదేళ్లలో జరిగిన దాన్ని సరిచేస్తూ ఇచ్చిన బడ్జెట్ ఇది అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రూ.18,421 కోట్లతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ఇచ్చారని వెల్లడించారు. గత బడ్జెట్ కంటే 23 శాతం ఎక్కువ ఆరోగ్యశాఖకు కేటాయించారన్నారు.
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 18 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.
ఈరోజు అసెంబ్లీలో ఆర్ధిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2.9లక్షల కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేశవ్ నివాసానికి ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు చేరుకుని బడ్జెట్ పత్రాలను మంత్రికి అందించారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉన్న లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు కొనసాగనున్నాయి.