AP Budget: ఈరోజు అసెంబ్లీలో ఆర్ధిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2.9లక్షల కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేశవ్ నివాసానికి ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు చేరుకుని బడ్జెట్ పత్రాలను మంత్రికి అందించారు. తన నివాసంలో బడ్జెట్ పత్రాలకు పయ్యావుల కేశవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ పత్రాలతో సీఎం నివాసానికి పయ్యావుల కేశవ్ వెళ్లారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనుండగా.. మండలిలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో రాజధాని, పోలవరం నిర్మాణాలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. సూపర్ సిక్స్ హామీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అసెంబ్లీలో కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేటి అసెంబ్లీకి వైసీపీ దూరంగా ఉండనుంది. మండలి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ కానున్నారు. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై జగన్ చర్చించనున్నారు.
Read Also: EPFO : 2024ఆర్థిక సంవత్సరంలో 7.37కోట్లకు చేరిన ఈపీఎఫ్ఓ సభ్యుల సంఖ్య.. ఇది దేనిని సూచిస్తుందంటే ?