ఏపీ శాసన మండలి నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన డయేరియా మరణాలపై పశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్ని మరణాలు జరిగాయి, చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
Minister Rama Naidu: 2014-19లో గత టీడీపీ పాలనలో రూ.3038 కోట్లు ఖర్చుపెట్టి 40 పనులు పూర్తి చేశామని.. 2019-24 వైసీపీ పాలనలో కేవలం రూ. 760 కోట్లు ఖర్చుపెట్టి 5 శాతం పనులు మాత్రమే చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ వేదికగా తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై తమ అనుచరులతో ఎన్జీటీలో వైసీపీ కేసులు వేయించిందని చెప్పారు. 2021 డిసెంబర్‌లో వైసీపీ అధికారంలో ఉండగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు ఎన్జీటీ […]
కర్నూలు జిల్లా కోసిగి మండలం కడదొడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు అత్యాచార యత్నం చేశారు. బాలిక తాత కేకలు వేయడంతో సర్పంచ్ హుసేని అక్కడి నుంచి పరారయ్యాడు.
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.
పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు పంపించామని చెబితే నమ్మారో.. ఇక అంతే సంగతులు. మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయిపోతాయి సుమీ. రోజుకో పంథాలో కేటుగాళ్లు అమాయకుల నుంచి దోచుకుంటున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి చిన్న మొత్తంలో డబ్బులు పంపించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు అసెంబ్లీలో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు - 2024 ను అసెంబ్లీలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు.
దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024 అందాల పోటీలో కీట్ యూనివర్సిటీ ఫ్యాషన్ స్కూల్ విద్యార్థిని తృష్ణా ర.. మిస్ టీన్ యూనివర్స్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. కిట్ ఫ్యాషన్ టెక్నాలజీ స్కూల్ విద్యార్థిని తృష్ణా రే ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా కిట్ విశ్వవిద్యాలయం, ఒడిశా, భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది.