చంద్రబాబు పులి మీద స్వారీ చేస్తున్నాడని.. ఆ పులి మిమ్మల్నే తింటుందని వైసీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాపై కక్ష్య గట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియాను చిందర వందర చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొలుములపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
వరకట్నం కోసం వేధించేవారు మాత్రం మారటం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి అయింది. విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ క్రమంగా తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మైక్ వాల్ట్జ్‌ని తన జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు. యూఎస్ సెనేట్‌లోని ఇండియా కాకస్ అధిపతి వాల్ట్జ్, అమెరికా కోసం బలమైన రక్షణ వ్యూహాన్ని సమర్థించారు.
లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) లెబనాన్ లోపల హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన ఛత్తీస్‌గఢ్ న్యాయవాదిని ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఫైజాన్ ఖాన్‌ను రాయ్‌పూర్ నివాసం నుండి అరెస్టు చేశారు. బాంద్రా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నవంబర్ 14న ముంబై వస్తానని ఫైజాన్ ఖాన్ గతంలో చెప్పాడు.
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.
సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2.94 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఇవాళఉదయం 10 గంటలకు బడ్జెట్‌పై ఎమ్మెల్యే లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపాల పండగలో ఇప్పటికే మూడు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నేడు కోటి దీపోత్సవంలో నాలగవ రోజు.