Varra Ravinder Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
- వర్రా రవీందర్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు
- వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varra Ravinder Reddy: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి కడప సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈకేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్ , సుబ్బారెడ్డి లకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని మెజిస్ట్రేట్ పోలీసులకు తెలిపారు. అర్దరాత్రి రెండు గంటల సమయంలో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కేసుకు సంబంధించిన పేపర్లను పీపీ, వర్రా రవీందర్ రెడ్డి తరఫు లాయర్లు మెజిస్ట్రేట్ ముందుంచారు. ఇరుపక్షాల వాదనల అనంతరం వర్రా రవీంద్ర రెడ్డికి రిమాండ్ విధించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
వర్రా రవీందర్ రెడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని మెజిస్ట్రేట్‌కు తెలిపారని ఆయన తరపు లాయర్ ఓబుల్ రెడ్డి వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి తెలిపేందుకు హైదరాబాదు నుంచి కడపకు వస్తున్నారని.. ఈ క్రమంలో కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అరికాళ్ళపై కొట్టి , తొడలపై కాళ్లతో ఎక్కి తొక్కి టార్చర్ చేసినట్లు మెజిస్ట్రేట్ తో చెప్పారన్నారు. విజయమ్మపై వైయస్ షర్మిల పై,సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని టార్చర్ చేశారని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలంటూ వారు టార్చర్ చేసినట్లు చెప్పాడని లాయర్ తెలిపారు. ఒప్పుకోకపోతే నీ కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని హెచ్చరించినట్లు కూడా మెజిస్ట్రేట్ ముందు వర్రా రవీంద్ర తెలిపాడన్నారు. వర్రా రవీంద్ర చెప్పిన స్టేట్మెంట్ అంతా మెజిస్ట్రేట్ రికార్డు చేశారని తెలిపారు. ఈరోజు మెడికల్ టెస్ట్‌కు పంపించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?