పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు పేరుతో ప్రతిపాదిత చట్టం.. సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ పరీక్షలతో సహా వివిధ పరీక్షలలో అన్యాయమైన పద్ధతుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన నిమిషాల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అంతకుముందు బుధవారం సాయంత్రం, భూ కుంభకోణంలో ఏడు గంటలకు పైగా ఈడీ ప్రశ్నించడంతో హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
మంగళగిరి వైసీపీ అడ్డా.. అభ్యర్థి ఎవరైనా గెలిచేది వైసీపీ అభ్యర్థేనని మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళగిరి సామాజిక సాధికార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. లోకేష్‌ను మడత పెట్టేస్తాం, టీడీపీని కృష్ణానదిలో కలిపేస్తామని ఆయన అన్నారు. మంగళగిరిలో గంజి చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్లు, వైఎస్ జగన్ గెలిచినట్లు అని మంత్రి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇంఛార్జుల మార్పును ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మారుస్తామని ఆయన ప్రకటించారు.
ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో మరో గొప్ప ముందడుగు పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్య అమలుకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐబీ మధ్య ఒప్పందం కుదిరింది.
ఒక జిల్లా ఒక ఉత్పత్తి(వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ – ఓడీఓపీ)లో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులను సీఎం జగన్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్-ఓడీఓపీలో ఒక్క ఏపీకే 6 అవార్డులు రావడం గమనార్హం.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి రావెలను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.