తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర బడ్జెట్ తయారీ అనేది చాలా నెలల పాటు సాగే సుదీర్ఘమైన కసరత్తు. బడ్జెట్ సమర్పణ అనేది దేశం యొక్క ఆర్థిక పథాన్ని రూపొందించే, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే కీలకమైన సంఘటన. భారతదేశంలో బడ్జెట్ ప్రక్రియ చరిత్ర చాలా ఆసక్తికరమైనది. మొదటి కేంద్ర బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి సమర్పించారు.
ఏపీలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లు రెండు రోజులుగా మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాసేపు రిజిస్ట్రేషన్లు జరిగితే కాసేపు నిలిచి పోతున్నాయి.
ఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు చేయూత పథకం నాలుగో విడత చెల్లింపులు జరుపుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మంగళవారం మరణించారు.
రాజస్థాన్‌లోని అల్వార్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కోడలు చిత్రా సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర (59) కూడా కారులో ఉండగా.. ఆయనకు గాయాలయ్యాయి.
మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ అధికారాన్ని కోల్పోతారనే భయంతో ఉన్నారు. ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష ఎంపీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అభిశంసన ప్రక్రియకు సంబంధించి పార్లమెంటు విధివిధానాల్లో మార్పుల కోసం ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు.