గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఇజ్రాయెల్ దళాల తాజా వ్యూహాలు బయటపడ్డాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రహస్య కార్యాచరణ ప్రణాళికలో భాగంగా.. దాని దళాలు పౌరులు, వైద్య సిబ్బంది వేషధారణలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని ఆసుపత్రిలోకి చొరబడి ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని 16 లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌కు 11 సీట్లు కేటాయించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.
భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. సమావేశంలో చర్చలు చాలా సహృదయపూర్వకంగా జరిగాయన్నారు. ఈ స్వల్పకాలిక సమావేశంలో ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఓ టోర్నమెంట్‌లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన ఆట కన్నా తన అందం, జుట్టు, బట్టలు, మాటతీరు వంటి అనవసర విషయాలపై దృష్టి సారించారని వాపోయారు.
బీహార్‌లో మహాఘటబంధన్ కూటమిని నితీష్ కుమార్ విడిచిపెట్టి ఎన్డీయేతో చేరిన కొద్ది రోజుల తర్వాత, నితీష్ ఇండియా కూటమిని వీడడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మౌనం వీడారు. బీహార్ కులాల సర్వే కారణంగానే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నిష్క్రమించారని రాహుల్ గాంధీ అన్నారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులైన సంగతి తెలిసిందే.
గతేడాది జూలై నెలలో మహారాష్ట్రలో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి మహారాష్ట్రలో అధికార కూటమిలో చేరారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేశారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మంగళవారం నాడు 60 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఓ బస్సు డ్రైవర్. ఆ వ్యక్తి బస్సును నడుపుతున్నప్పుడు అతనికి గుండెపోటు రాగా.. ఆ నొప్పితో కూడా బస్సును ఆపి బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు