సినీనటుడు శివాజీ ఓటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు డబ్బులు అడగొద్దని.. తప్పు చేసి చాలా మంది సంపాదిస్తున్నారని ఆయన ప్రజలకు సూచించారు. తెలుగు వాడికి కష్టం వస్తే తాను సహించనని.. అన్యాయం చేస్తే ఎంతటి వాడినైనా ప్రశ్నిస్తానని అన్నారు.
విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. రేపటి నుండి 5 రోజుల పాటు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. రెండు రోజులపాటు ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపు ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుండి స్టేడియంలోకి వీక్షకులను సిబ్బంది అనుమతించనున్నారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ ముద్దుబిడ్డ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకుంది. 50ఏళ్ల క్రితం విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య ప్రారంభమైన రాకపోకలు నిరంతరాయంగా కొనసాగిస్తోంది గోదావరి ఎక్స్‌ప్రెస్.
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లాలో వాలంటీర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఈ ఘటనకు కారణమని అనుమానిస్తుండగా.. మృతుడి శరీరంపై విచక్షణ రహితంగా గాయాలు వున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దేశ మధ్యంతర బడ్జెట్-2024ను సమర్పించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను మొదట వివరించారు. మాకు మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఇలా నాలుగు కులాలు ఉన్నాయని, వారిపైనే దృష్టి సారించామన్నారు.
దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో గల విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు ప్రారంభమయ్యాయి.
మలేషియాలోని దక్షిణ రాష్ట్రమైన జోహోర్‌కు చెందిన సుల్తాన్ ఇబ్రహీం బుధవారం దేశ 17వ రాజుగా బాధ్యతలు చేపట్టారు. కౌలాలంపూర్‌లోని నేషనల్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.