మూడు సార్లు సీఎంగా చేస్తే, మ్యానిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. 'సిద్ధం' పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈఓ ఎంకే మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై సీఈఓ సమీక్ష చేపట్టారు. ఓటర్ల నమోదు, మార్పు చేర్పుల దరఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలని.. ఇవాళ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్ అని ఆయన పేర్కొన్నారు.
అత్తగారింటికి వెళ్లేందుకు మద్యం మత్తులో 108కు కాల్ చేశాడు ఓ మందుబాబు. తప్పతాగి అర్థరాత్రి 108కు మందు బాబు ఫోన్ చేసిన ఘటన హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరిలో చోటుచేసుకుంది. కాళ్లలో నొప్పి వేస్తోందని, నడవలేకపోతున్నానని ఓ వ్యక్తి 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. దీంతో క్షణాల్లో ఫోన్ చేసిన వ్యక్తి వద్దకు యాదగిరిగుట్ట 108 వాహనం చేరుకుంది.
అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్ల అమ్మకానికి యూఎస్ అనుమతినిచ్చింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ రోజు సాధ్యమయ్యే విక్రయాల గురించి యూఎస్ కాంగ్రెస్‌కు తెలియజేస్తుంది.
బెజవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. టికెట్ తనకు ఇవ్వాలని దుర్గగుడికి ర్యాలీగా వెళ్లి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బల ప్రదర్శన చేయగా.. మైనార్టీలకు ఈ టికెట్ ఇవ్వక పోతే ఉరి వేసుకుంటారో, ఇంకా ఏం చేస్తారో తెలియదని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వార్నింగ్ ఇస్తున్నారు.
బడ్జెట్‌లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలకు గత బడ్జెట్‌లో దీర్ఘకాలం పాటు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చారు.. ఇప్పుడు కూడా కేటాయించారని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు నెరవేర్చారని.. ఖచ్చితమైన డెడ్ లైన్ అవసరం లేదన్నారు.