తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో మే నెల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది.
నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే 'సిద్ధం' బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల కోసం పోలీసులున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు.. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను ఏసీబీ సీజ్ చేసింది.
బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వుంటే మా ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని మల్లారెడ్డి ప్రశ్నించారు.
ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీస్ ఓవరాల్ ఛాంపియన్ షిప్(చార్మినార్ ట్రోఫీ)ను సాధించిందని డీజీపీ రవి గుప్తా తెలియజేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ చార్మినార్ ట్రోఫీని కైవసం చేసిందని డీజీపీ తెలిపారు.
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను సర్కారు నియమించింది. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేశ్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సారి సమ్మర్ ముందుగానే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఫిబ్రవరి మొదలు కాగానే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దానితో జనాలు కూడా అప్రమత్తం కావాల్సిన టైం వచ్చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. మన శరీరాన్ని డీహైడ్రేట్ అవకుండా చేసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అవి ఏంటంటే..