ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్.. జ్యోతి ప్రజ్వలన చేసి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, కళాశాల డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంట్లో అప్రజాస్వామ్యక పద్ధతిలో ఆమోదం జరిగి ఇవాల్టితో 10 ఏళ్లు పూర్తయ్యాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పాస్ అవలేదు అన్న విషయం లోక్‌సభ ప్రచురించిన డాక్యుమెంటులోని ఉంది దాని ఆధారంగానే కోర్టుకు వెళ్లానన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీవో కార్యాలయం సమీపంలో మారణాయుధాలతో దాడి చేసిన ఘటన జరిగింది. ఈ దాడి ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక యువకుని పరిస్థితి విషమంగా ఉంది. ఆరిఫ్ (19) అనే యువకుడికి కడుపులో బలమైన గాయం కావడంతో పేగులు బయటకు వచ్చినట్లు తెలిసింది.
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలి అన్న దృఢ సంకల్పంతో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేపట్టి ఇంటి ఇంటికి..గడపగడపకి తిరుగుతున్నారు టీడీపీ నేతలు. ఈసారి తమ ప్రభుత్వం రూలింగ్‌లోకి వస్తే ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అన్న విషయాన్ని అందరికీ వివరిస్తూ.. అందరికంటే యాక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.
అయోధ్య ఆలయానికి భక్తజనాన్ని నియంత్రించడం ఇప్పుడు ఒక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాది మందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం ట్రస్ట్ టీటీడీ సహకారాన్ని కోరింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పవన్ విశాఖకు రానున్నారు. సాయంత్రం ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేర్వేరుగా మాట్లాడనున్నారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలింటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీరియస్ అయిన ప్రభుత్వం.. గుంటూరు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది.