తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.
తిరుపతి జూపార్క్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు ప్రహ్లాద్ గుర్జార్ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు తేలింది. సింహం తలను ముట్టుకుంటానని, అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినట్లు తెలిసింది.
హరిత విప్లవం నీలి విప్లవం వచ్చాయని.. ఉద్యోగ విప్లవం తెచ్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డేనని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
రాజకీయ ప్రకటనల విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా సమావేశమయ్యారు. రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పని సరి అని సీఈవో రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు.
ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లంచంలేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు.
బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. .. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయితే, ఏపీలోని రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.. మూడు సీట్లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి ముగ్గురు నామినేషన్ల దాఖలు చేశారు..
బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెరమీదకు తెస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.