Mallareddy: బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వుంటే మా ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని మల్లారెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదన్నారు. మల్కాజిగిరి టిక్కెట్ భద్రంగా వుందన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మాదేనని ధీమా వ్యక్తం చేశారు. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు.. మా కుటుంబం వేరన్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. మా యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు వుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే తాను ఏం చేయలేనన్నారు.