*నేడు అనంతపురం రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ.. ‘సిద్ధం’ బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం జగన్.. రాయలసీమ జిల్లాల నుంచి భారీగా తరలిరానున్న కార్యకర్తలు.. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలో ప్రసంగించనున్న సీఎం జగన్.
*నేడు, రేపు విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన.. మధ్యాహ్నం 2.30గం.లకు నగరానికి రాక… సాయంత్రం ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సమావేశం.. 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలతో వేర్వేరుగా మాట్లాడనున్న అధ్యక్షుడు.. పొత్తులో జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వనున్న పవన్.. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీపై స్పష్టత వచ్చే అవకాశం.
*నేడు కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విచ్చేయనున్న త్రిదండి చిన్న జీయర్ స్వామి.. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ మంజూరు చేసిన రెండు కోట్ల 13 లక్షల రూపాయలు చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. శ్రీ రంగనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఐదంతస్తుల రాజగోపురం నిర్మాణం పనులకు శంకుస్థాపన.. అనంతరం త్రిదండి చిన్న జీయర్ స్వామి అనుగ్రహ భాషణం.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
*ఢిల్లీ: నేడు రెండో రోజు బీజేపీ జాతీయ సమావేశాలు.. ప్రధాని మోడీ ప్రసంగంతో ముగియనున్న సమావేశాలు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న ప్రధాని మోడీ.
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,400.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.78వేలు