వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు.
నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీకి ప్రజల చేతిలో ఓటమి ఖాయమన్నారు.