దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయానికి పిలవకుండా వారి ఇంట్లోనే విచారించాలనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులను కవిత గతేడాది సవాల్ చేశారు.
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్‌జీ గోండు పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు.
కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5మంది బీఆర్‌ఎస్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని.. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతలు చేరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
ప్రముఖ ఆన్‌లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం కుదిరింది.
ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. నేను చంద్రబాబు లాగా కుర్చీ లాక్కున్న లక్షణం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ లాక్కున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం సమీక్షలు నిర్వహించే రూమ్‌లో కూర్చున్నానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి కుర్చీలో నేను కూర్చోలేదన్నారు.