*పాత బస్తీకి మెట్రో.. ఈ నెల 8న భూమి పూజ
హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్జ్ లో మరో అడుగు ముందుకు పడింది.. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత బస్తీకి మెట్రో మోక్షం లభించింది. ఈ నెల 8న ఓల్డ్ సిటీలో 5 కిలో మీటర్ల మేర మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ మెట్రో మార్గాన్ని ఓల్డ్ సిటీ మీదుగా ఫలక్ నుమా వరకు పొడిగించనున్నారు. ఇక, 2017 నుంచి హైదరాబాద్ లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.. అప్పటి నుంచి విడతల వారీగా మెట్రో రూట్లను ప్రారంభించారు. అప్పటి నుంచి ఓల్డ్ సిటీలో 5 కిలో మీటర్ల మెట్రోకి మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఓల్డ్ సిటీలో మెట్రోకు లైన్ క్లియర్ అయింది. దీంతో ప్రస్తుతం 69 కిలో మీటర్ల మొదటి దశ మెట్రో ప్రాజెక్టు.. పాతబస్తీ మార్గంతో ఉన్న 74కిలో మీటర్ల మేర మెట్రో సేవలు విస్తరించనున్నాయి..
*మీ పెంపుడు కుక్కకు ఉన్న విలువ ప్రజలకు లేదా..
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో లెక్చరర్స్, టీచర్స్, కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యమ స్ఫూర్తీతో పని చేయాల్సిన నాటి ప్రభుత్వం గాలికి వదిలేసింది అని విమర్శించారు. కల్వకుంట్ల ఉద్యోగాలు ఊడగొట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇంట్లో పెంపుడు కుక్కకు జ్వరం వచ్చింది అని డాక్టర్ మీద చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మీరు పెంచుకున్న కుక్కకు ఉన్న విలువ ప్రజలకు లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడాలని అనేది మా విధానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు భరోసా ఇవ్వాలి అనేది మా పాలసీ.. మా ప్రభుత్వం వచ్చింది.. మా ఉద్యోగాలు వస్తాయి అనే భరోసా ఇస్తున్నాం వారికి.. గడీలో బందీ అయినా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వచ్చామా లేదా..? అని ఆయన అడిగారు.. మా పని తీరు.. మా నియామకాలపై ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అనే పదం వినొద్దని చెప్పినం.. గంజాయి మొక్క కూడా ఉండొద్దు అని చెప్పామని సీఎం చెప్పుకొచ్చారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద విద్యార్థులకు అవగహన కల్పించండి.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో కొన్ని నియామకాలు ఆగిపోయాయి. కోడ్ అయిపోగానే అందరికి ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మీ సహకారం మా ప్రభుత్వానికి ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
*రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి..
ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. గతంలో రిప్రజేంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వని గత పాలకులు నేడు ఉద్యోగాల జాతరను చూసి ఓర్వలేక ప్రతి రోజూ ఏదో ఒక విమర్శలు చేస్తున్నారు.. ఎన్ని దూషణలు చేసిన నిబద్దత సంకల్ప బలంతో ఇచ్చిన ప్రతి హామీని తూ.చ తప్పకుండా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మీ విమర్శలు మాకు అడ్డంకి కానే కావు.. మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు వేల మందితో సోషల్ మీడియా నిర్వహిస్తూ ప్రజలను పక్కదోవా పట్టిస్తున్నారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం చేసి చూపించాము అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు చేశారు అంటూ విమర్శలు గుప్పించారు. మా ప్రభుత్వం 3 నెలల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం.. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి.. ఆ ఉద్యోగం ద్వారా కుటుంబం ద్వారా సమాజం బాగుపడాలి అని ఆయన చెప్పుకొచ్చారు. నోటిఫికేషన్ తో పాటు వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ లు ఒకే గదిలో పది మంది ఉంటున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.. హైదరాబాద్ నడి బొడ్డున జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం అని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం నుంచే కాదు దేశంలోనే అత్యుత్తమైన సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ తో పాఠాలు చెప్పించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆన్ లైన్ లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాము.. సోదరులారా ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. నిష్టా గరిష్టతతో పని చేస్తాం.. చేసే క్రమంలో ఏలాంటి ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన ఎదుర్కొంటాము అన్నారు. బాగా చదువుకుని ఉద్యోగాలు పొందిన వారికి.. వారి తల్లిదండ్రులకు అభినందనలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
*రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
రేపు(మంగళవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ విశాఖలో పర్యటించనున్నారు. పారిశ్రామిక, వ్యాపార వేత్తల సదస్సుకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ పేరుతో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు జగన్.. అనంతరం భవిత పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన వివరాలను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ వైజాగ్‌లో పర్యటన చేస్తున్నారని ఆయన వెల్లడించారు. విజన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు 2000 మంది ప్రముఖులు హాజరవుతారన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారని.. విశాఖను ఒక గ్లోబల్ సిటీగా మార్చాలనేది సీఎం ఆలోచన అని చెప్పారు. ఈస్ట్ కోస్ట్ కు గేట్ వేగా వైజాగ్‌ను చూడాలనేది సీఎం ఉద్దేశమని మంత్రి తెలిపారు. విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని విజన్ విశాఖ పేరుతో ప్రసంగిస్తారన్నారు. గ్లోబుల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా గ్రౌండ్ అయిన పెట్టుబడుల వివరాలను సీఎం జగన్ తెలియజేస్తారని మంత్రి చెప్పారు. విశాఖ అభివృద్ధికి సంబంధించి విజన్ విశాఖ డాక్యుమెంట్‌ను సీఎం జగన్ విడుదల చేస్తారని వెల్లడించారు. 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన జీవీఎంసీ భవన్‌కు శంకుస్థాపన సీఎం జగన్ చేయనున్నారని చెప్పుకొచ్చారు. 7 కోట్ల రూపాయలతో స్కిల్ సెంటర్స్‌కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 7వ తేదీన అనకాపల్లిలో ఆసరా 4వ విడత కార్యక్రమంను ప్రారంభిస్తారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఈ సందర్భంగా చెప్పారు.
*వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది.. రా కదలి రా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రమని.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ ‘రా కదలి రా’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టామన్నారు. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చామని.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేదని ఆయన అన్నారు. తన మీద నమ్మకంతో కియా పరిశ్రమ పెనుకొండకు వచ్చిందన్నారు. ఐదేళ్లలో కియా పరిశ్రమను తెచ్చాం….పదేళ్లు టీడీపీ అధికారంలో ఉంటే మరిన్ని పరిశ్రమలు వచ్చేవన్నారు. రాజశేఖర్ రెడ్డి హాయంలో లేపాక్షి నాలెడ్జ్ సిటీ , స్తెన్స్ సిటీ వచ్చిన ఒక్కరికీ ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. నాలెడ్జ్ హబ్ లో జగన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ ఈ రాష్ట్రాన్ని తన తాత జాగీర్ అనుకున్నాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. సిద్ధం సభకు వచ్చిన సీఎం జగన్ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కూడా మాట్లాడలేదన్నారు. సీఎం జగన్ ఓడిపోవడానికి సిద్ధమని.. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ- జనసేన కూటమి అని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పింఛన్ విధానం ప్రారంభించింది ఎవరో నన్ను విమర్శించే వారికి తెలుసా అంటూ ప్రశ్నించారు. తాము కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3వేలు ఇస్తామని.. వాలంటీర్ల ఉద్యోగాలను తీసేయమని… వాలంటీర్లు వ్యవస్థ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.వాలంటీర్లు వైసీపీ దొంగలకు పనిచేయొద్దన్నారు. రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసింది తెలుగుదేశం పార్టేనని ఆయన అన్నారు. రాజకీయ రౌడీలు నాకు లెక్క కాదు.. టీడీపీ కార్యకర్తలను వేధించే వాళ్లకు ఖబడ్దార్… దెబ్బకి… దెబ్బ, మంచికి… మంచి అంటూ హెచ్చరించారు. మేము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. సత్యసాయి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చురకలు అంటించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. “పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ట్రాన్స్‌ఫర్ అయ్యాడు కళ్యాణదుర్గాన్ని సర్వం దోచుకున్న మంత్రి ఉషశ్రీ ఇప్పుడు పెనుకొండకు వచ్చింది.. పెనుకొండకు శంకరనారాయణ పోయినా… ఆయన కంటే భయంకరమైన ఉషశ్రీ ఇక్కడికి వచ్చింది. దౌర్జన్యాలు, దోపిడీల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపు. నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి నీ అకౌంట్ సెటిల్ చేస్తా తోపు. ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు కేతిరెడ్డి. సోషల్ మీడియాలో పేపర్ టైగర్ కేతిరెడ్డి. జిల్లాలోనే అత్యంత అవినీతిపరుడు కదిరి ఎమ్మెల్యే… ఆయనకు సీటు కూడా పోయింది. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట అవినీతి పుట్ట… పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సీటు కూడా డౌటే. మడకశిరకు పట్టిన రోగం ఎమ్మెల్యే తిప్పేస్వామి…. తిప్పేస్వామి సీటు కూడా చినిగిపోయింది.” అని టీడీపీ అధినేత అన్నారు.
*జన సైనికులే చంద్రబాబును పాతాళానికి తొక్కేస్తారు..
పాతికేళ్ల కాలం నుంచి రాజమండ్రి బాగా తెలుసని.. గడిచిన ఐదేళ్లలో రాజమండ్రి డెవలప్మెంట్ కనిపిస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి చిత్తశుద్ధితో తన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో మార్గాని భరత్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు. రాజమండ్రి ప్రాంతాన్ని వైయస్సార్ పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత సీఎం జగన్ భరత్‌కు అప్పగించారన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ప్రాణం పోయినా జగన్ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం జగన్ వెంటే నిలబడతామన్నారు. స్కూళ్ల అభివృద్ధి కోసం చంద్రబాబు 500 కోట్లు ఖర్చుపెడితే.. జగన్మోహన్ రెడ్డి 73 వేల కోట్ల రూపాయలు పాఠశాలల కోసం ఖర్చు పెట్టారన్నారు. ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా రూపాయి ఖర్చు లేకుండా లక్షల మందిని సీఎం జగన్ ఆదుకుంటున్నారని కొడాలి నాని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంపదను పేద కుటుంబాలకు అందించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని ఆయన అన్నారు. సిగ్గు శరం లేకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ గురించి మాట్లాడుకుంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. భరత్‌ను, గూడూరు శ్రీనివాసును ఎమ్మెల్యే, ఎంపీలుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొడాలి నాని ప్రజలను కోరారు. ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్‌కు వార్నింగ్ ఇచ్చారని.. ఆడపిల్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వటం మగతనమా అంటూ మండిపడ్డారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో తెలియదు కానీ… మే నెలాఖరుకు సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. జన సైనికులే చంద్రబాబునాయుడిని పాతాళానికి తొక్కేస్తారన్నారు. ఇద్దరు వెన్నుపోటు దారులతో పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్నాడు.. ఎవరు ఎప్పుడు ఎలా వెన్నుపోటు పొడుస్తారో తెలియదన్నారు. జగన్మోహన్ రెడ్డి అందరినీ గెలిపించడానికి వ్యూహం పన్నుతాడు తప్ప… ఏ ఒక్కరిని ఓడించాలనో ఆలోచించరని అన్నారు. గుంట నక్కలతో ప్రయాణం చేసే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలన్నారు.
*సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన భూమా కిషోర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ చాలా మంది పార్టీలు మారుతున్నారు. అధికార వైసీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ఛార్జి భూమా కిషోర్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు. భూమా కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నేతలు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
*కర్ణాటక అసెంబ్లీలో పాక్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్టు
కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ గెలుపు అనంతరం ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటూ..‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అని నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం బీజేపీ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ ఆరోపణలపై వాయిస్ నివేదికను ఎఫ్ఎస్ఎల్‌కి పంపగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్టయిన ముగ్గురు ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరులోని ఆర్టీ నగర్‌కు చెందిన మునవర్, హవేరీలోని బ్యాడగికి చెందిన మహ్మద్ షఫీగా గుర్తించారు. అంతకుముందు.. బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ నినాదాలు నిజమని ప్రతిపక్ష బీజేపీ నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక.. వీడియో, ఆడియో రెండింటిలోనూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఉన్నట్లు ధృవీకరించింది. అంతేకాకుండా.. ఫుటేజీలో అవకతవకలు జరగలేదని పేర్కొంది. కాగా.. “ఫిబ్రవరి 27న, కర్ణాటక అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు విధాన సౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఫోరెన్సిక్ నివేదికపై చర్చించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధ భద్రతా డీసీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. విధానసౌధలోకి చాలా మందిని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. మరోవైపు.. ఈ అంశంపై విపక్ష బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత ఆర్.అశోక ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ‘రాజ్‌భవన్ చలో’ మార్చ్ చేపట్టారు.
*హైతీలో ఎమర్జెన్సీ విధింపు
హైతీలో సాయుధ మూకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌లో ఘోరమైన నేరాలు చేసే వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలాది మంది ఖైదీలు పరారయ్యారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. హైతీ (Haiti)లో 72 గంటలపాటు అత్యవసర పరిస్థితిని విధించారు. అలాగే రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పోర్ట్ ఔ ప్రిన్స్ జైలు నుంచి శనివారం వేల సంఖ్యలో కరుడుగట్టిన నేరగాళ్లు తప్పించుకుని పోయారు. ఇదిలా ఉంటే ఘర్షణల్లో 12 మంది మృతి చెందగా.. 4,000 మంది ఖైదీలు పరారయ్యారు. 2021లో దేశాధ్యక్షుడు జువెనల్ మోయిసె హంతకులు కూడా ఇదే జైలులో ఉన్నారు. వారు తప్పించుకొన్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాని హెన్రీ రాజీనామా చేయాలంటూ సాయుధ మూకల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక గ్రూపులను సమన్వయం చేసుకొంటూ బార్బెక్యూ అనే నేరస్థుడు ఈ దాడులకు తెగబడ్డాడు. ప్రస్తుతం ఆ గ్రూపులు రాజధానిని 80 శాతం తమ అధీనంలోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. హైతీలో 2020 నుంచి జరుగుతున్న గ్యాంగ్‌వార్‌ల్లో ఇప్పటివరకు వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకొని గ్యాంగ్‌లు దాడులు చేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మోయిసె హత్య తర్వాత హెన్రీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి పార్లమెంట్, అధ్యక్ష ఎన్నికలను తరచూ వాయిదాలు వేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగడం లేదు. 1.1 కోట్ల మంది ఉన్న జనాభాకు పోలీస్ దళంలో 9 వేల మంది సిబ్బందే ఉన్నారు. దీంతో సాయుధ గ్యాంగ్‌లను అదుపుచేయలేక పోతున్నారు.