Smriti Irani: యూపీఏ హయాంలోని పాలనకు, నరేంద్ర మోడీ సర్కారుకు మధ్య ఉన్న తేడాపై చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. నాగ్‌పూర్‌లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యువ మహా సమ్మేళనంలో ఆమె ఈ మేరకు ఛాలెంజ్ చేశారు. రాహుల్‌ను చర్చకు రావాలని కోరితే రాలేదన్నారు. బీజేపీకి చెందిన ఒక సామాన్య కార్యకర్త ముందు కూడా రాహుల్ నిలబడలేడని ఆమె ఎద్దేవా చేశారు.
Read Also: Electoral Bonds: వివరాలివ్వడానికి జూన్ 30 వరకు సమయమివ్వండి.. సుప్రీంకోర్టును కోరిన ఎస్‌బీఐ
యువమోర్చాకు చెందిన ఓ సామాన్య కార్యకర్త రాహుల్ గాంధీ ముందు మాట్లాడినా మాట్లాడే శక్తి కోల్పోతాడని తాను హామీ ఇస్తున్నానన్నారు.10 ఏళ్లలో బీజేపీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మూడు ప్రధాన హామీలను నెరవేర్చిందని స్మృతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.అప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన ఆర్టికల్ 370 రద్దు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్, రామమందిర నిర్మాణం ఈ వాగ్దానాలేనని, వాటిని నెరవేర్చామని ఆమె అన్నారు.