Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Gutha Sukender Reddy Family

Off The Record: గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఫ్యామిలీ బీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై గరం గరంగా ఉందా..? |

NTV Telugu Twitter
Published Date :March 4, 2024 , 9:30 pm
By Mahesh Jakki
Off The Record: గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఫ్యామిలీ బీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై గరం గరంగా ఉందా..? |
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: సిద్ధం… సిద్ధం… అంటూ ఇన్నాళ్ళు ఎంపీగా పోటీకి తెగ ఉబలాటపడిపోయిన ఆ లీడర్‌ ఉన్నట్టుండి కాడి పడేశారు. నేనొగ్గేస్తున్నా… నావల్ల కాదని చేతులెత్తేశారట. ఏదో కష్ట కాలంలో పార్టీని ఆదుకుందామనుకుంటే…. అంటూ మేటర్‌ని బాగా సాగదీస్తున్నారట. ముందు ఎందుకంత ఆరాటపడ్డారు? తర్వాత ఎందుకు కాదనుకున్నారు? అసలు ఎవరా లీడర్‌? ఏంటా కథ?

గుత్తా ఫ్యామిలీ గందరగోళంగా, ఇంకా చెప్పాలంటే…. బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం మీద గరం గరంగా ఉందా? అంటే.. అవునన్న సమాధానమే వస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల నుంచి. తన కుమారుడు అమిత్‌రెడ్డిని లోక్‌సభ బరిలో దింపేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి. అటు అమిత్‌ కూడా … నల్లగొండ ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధమంటూ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచి బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. కానీ…. తాజాగా పోటీపై పునరాలోచనలో పడ్డారట. అందుకు పెద్ద కారణాలే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గుత్తా అమిత్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. తమకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యేలంతా జట్టు కట్టినందున ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం కంటే… కామ్‌గా ఉండటమే గౌరవప్రదమని గుత్తా శిబిరం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతమంది వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం వగరు పోగొట్టుకోవడం ఎందుకనుకుంటూ… ఉమ్మడి నిర్ణయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న నిర్ధారణకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గుత్తా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానం మీద చేసిన వత్తిడి ఫలించిందని అంటున్నాయి పార్టీ వర్గాలు. మాజీలంతా కట్టకట్టుకుని నై అంటుంటే…. నేను మాత్రం సై అని ఎలా అనగలనంటూ అమిత్‌ సన్నిహితులకు చెబుతున్నట్టు తెలిసింది. తాజా పరిణామాలతో సదరు మాజీ ఎమ్మెల్యేల తీరుపై గుత్తా ఫ్యామిలీ గుర్రుగా ఉందట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చెమటోడ్చితేనే విజయం కష్టం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందని, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను పోటీకి ముందుకు వస్తే… సహకరించాల్సింది పోయి వెనక గోతులు తీయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమను ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడి సమన్వయం చేయాల్సిన పార్టీ పెద్దలు కూడా వారికే మద్దతు పలకడం ఏంటని కూడా ప్రశ్నిస్తోందట గుత్తా ఫ్యామీలీ. మాజీ ఎమ్మెల్యేల ఒత్తిడితో వాస్తవాలు మరిచి తనకు పరోక్షంగా నో చెప్పడం సరైందని కాదన్న అభిప్రాయంతో అమిత్‌ ఉన్నట్టు తెలిసింది. కావాలనే తమపై నిందలు మోపడం సరైంది కాదని, వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ప్రతీ కార్యకర్తకు తెలుసునని, ఓటమి తర్వాతనైనా వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటుందని గుత్తా వర్గం కూడా గట్టిగానే అంటోందట. తమకు వ్యతిరేకంగా జట్టుకట్టడంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి… ఎంపీగా పోటీకీ దిగుతారా అని కూడా సవాల్‌ చేసే ధోరణిలో ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. గెలుపు ఓటములపై వాస్తవాలు మాట్లాడుకోవడం మరిచి… తమ కుటుంబంపై నిందలు వేసి… బీఆర్ఎస్‌కు దూరం చేసే కుట్ర జరుగుతోందని కూడా గుత్తా ఫ్యామిలీ ఆవేదన వ్యక్తం చేస్తోందట. కుమారుడి పొలిటికల్‌ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సుఖేందర్ రెడ్డి ఆశలపై…. సొంత పార్టీ నేతలే నీళ్లు చల్లడంతో ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో సుఖేందర్‌రెడ్డి ఒంటరి అవుతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానూ… ఇదే తంతు కొనసాగుతోందని, ఇలాగైతే రాజకీయం ఎలా చేయగలమని తండ్రీ కొడుకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ డెవలప్‌మెంట్స్‌తో సుఖేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోనే ఉంటారా? లేక ప్రత్యామ్నాయం వెదుక్కుంటారా అన్న చర్చ కూడా మొదలైంది నల్గొండ రాజకీయవర్గాల్లో. దీంతో ఇప్పుడు ఆయన అడుగులు ఎలా పడబోతున్నాయన్న ఆసక్తి పెరుగుతోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • gutha sukender reddy
  • kcr
  • off the record
  • OTR

తాజావార్తలు

  • Vijay Devarakonda : నా ప్రతి అవార్డు వాళ్లకే సొంతం.. విజయ్ ఎమోషనల్ పోస్ట్..

  • High Court Serious: కార్పొరేషన్‌ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా..? అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం..!

  • CM Chandrababu: రౌడీయిజం చేస్తామంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది..

  • Mohan Babu: ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను!

  • Jawahar Navodaya: కొత్తగా ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు.. జూలై 14 నుండి ప్రారంభం..!

ట్రెండింగ్‌

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions