Off The Record: వరంగల్ బీఆర్‌ఎస్‌లో తిరుగులేని ఆ నేతలు ఇప్పుడు కారును ఖాళీ చేస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి వరంగల్‌లో కారు ఖాళీ అవుతోందా? ఉక్కపోతనో… ఇంకోటనో… ఏదో ఒక సారు చెప్పేసి నేతలంతా ఉన్నపళంగా కారు దిగేస్తున్నారా? బీఆర్‌ఎస్‌కు ఒకప్పుడు తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వరంగల్‌లో ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది? లీడర్స్, కేడర్ ఏమంటున్నారు? లెట్స్ వాచ్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే ముఖ్య నాయకులను చేర్చుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మకూరు ఎంపీపీ, జడ్పీటీసీలు, మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ వైపు నడిచారు. ఆ తరువాత గీసుగొండ ఎంపీటీసీలు, పరకాల ఎంపీపీ కూడా బీఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్ వరంగల్లో పట్టు సాధించేందుకు పలువురు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్ నేతలు పరోక్షంగా వారి నుండి నుంచి సహకారం తీసుకున్నారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్‌లోనే ఉన్నారట. తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి సైతం కాంగ్రెస్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ని చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ ఎత్తుగడలు వేస్తోందని పసిగట్టిన మేయర్ ముందు జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. అలాగే 15 మంది కార్పొరేటర్స్‌కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారట.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కీలక నేత అయిన మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు కూడా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ బాట పట్టారు. వీరితోపాటు వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకొని దేనికైనా రెడీ అంటున్నారట. మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి సైతం పొలిటికల్ పుట్టింటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. కాంగ్రెస్ నుంచి ఎదిగిన పద్మావతి తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరేందుకు కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆమె కండువా మార్చడం ఖాయమని తేలిపోయింది. ఇక టేకుమట్ల జడ్పిటిసి తిరుపతిరెడ్డి సైతం బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరూ కండువా మార్చేస్తారట. ఇక అన్నిటికీ మించి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ సైతం పార్టీని వీడుతుండడంఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి పెద్ద కుదుపేనంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కారు పార్టీకి ఎలాంటి సమస్యలు వస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!