ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల బడ్జెట్‌లో రూ.900ల కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్‌లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 337 ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి చుట్టూ ట్రెంచ్ కొట్టించింది.
ప్రముఖ విద్యావేత్త సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసారు. ప్రెసిడెంట్ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఉమెన్స్ డే రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం.
నేడు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును(నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేయబడింది. ఇందులోని ప్రయాణీకులందరికీ పూర్తి ఛార్జీ వాపసు చేయబడుతుందని అధికారులు ప్రకటించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి మహిళలను ప్రోత్సహించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఘరానా మోసం జరిగింది. మంత్రాలతో చేతబడిని తొలగిస్తాను, దెయ్యాన్ని తొలగిస్తాను అంటూ నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళకు టోకరా వేసిన ఘటన ఫిల్మ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
బీజేపీ అనేది పెద్ద కుటుంబం.. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తనకు కల్మషం ఉండదని, ఎవరి మీద కోపం ఉండదని.. ఎవరితో తనకు అభిప్రాయ భేదాలు లేవని ఆయన తెలిపారు.
వేయి స్తంభాల గుడిలో పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి ఉదయమే చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో కిషన్ రెడ్డి పూజలు చేశారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠుణ్ణి సీఎం ప్రార్ధించారు.