జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఎస్‌బీఐకి మార్చి 12 వరకు అంటే రేపటి వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
ఎన్నికల బాండ్లవివరాల వెల్లడికి ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్‌కు అన్ని ఎలక్టోరల్ బాండ్ లావాదేవీల వివరాలను అందించడానికి అదనపు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
ఈనెల 11 నుండి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11న(రేపు) స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పాల్గొననున్నారు.
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభ గురించి మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అన్నారు. 15 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారన్నారు. ఈ సభ మాకు ఎన్నికల ప్రచారం లాంటిదన్నారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఓ మైనర్ బాలికపై, 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఇదే పట్టణానికి చెందిన షేక్ సుబాని(45) అత్యాచారం చేసి పరారైనట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ కూడా ఇప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన వైసీపీ చేరికపై స్పష్టత ఇచ్చారు. ఆయనే స్వయంగా స్పందించారు. ఈనెల 14న వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని వెల్లడించారు.