KP Nagarjuna Reddy: గిద్దలూరు నియోజకవర్గం నుంచి సిద్ధం సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని వైసీపీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. బేస్తవారిపేట మండలం ఎంపీపీ కార్యాలయంలో జేస్తవారిపేట మండల ఎంపీపీ అధ్యక్షతన చేస్తవారిపేట మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, అడ్పిటీసీ, ఇతర సీనియర్ నాయకుల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మన జిల్లాలో తలపెట్టిన సిద్ధం సభను మన అందరం కలిసి విజయవంతం చేయాలని సూచించారు. తన విజయంలో నేతలంతా భాగస్వాములు కావాలని, తాను ఎప్పుడూ మీకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ఆశీర్వదించాలని ఆయన నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్బీటిపీ, మండల కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు,వివిధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.