సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ జరగనుంది. ఫేజ్ 2లో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. సిటీలోని నలుమూలల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టు కనెక్ట్ అయ్యేలా కొత్త రూట్ డిజైన్ చేశారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువై ఉన్న ఏడు పాయల వనదుర్గా భవాని జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. మహాశివరాత్రి నుంచి మూడు రోజుల పాటు వనదుర్గా భవాని జాతర కొనసాగనుంది.
గురువారం జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయ నాయకుడు అనుకున్నాను కానీ జ్యోతిష్యుడు అనుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
మహామృత్యుంజయ్ మంత్రాన్ని పఠించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది. మహాశివరాత్రి నాడు, మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుడిని కూడా పూజించవచ్చు. మహామృత్యుంజయ మంత్రం మూల కథ శివునితో ముడిపడి ఉంది. రండి, మహామృత్యుంజయ మంత్రం కథ, దానిని జపించవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి(SH01) ఎలివేటెడ్ కారిడార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన తెలిపారు.
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు.
సాహితీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు సీసీఎస్ పోలీసులు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులకు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది.