Muhammad Yunus: దిగిపోతూ, భారత్‌పై యూనస్ అక్కసు..‘‘7 సిస్టర్స్ కామెంట్స్’’..
- దిగిపోతున్నా అదే అక్కసు..
- భారత్‌కు వ్యతిరేకంగా యూనస్ వ్యాఖ్యలు..
- ఈశాన్య రాష్ట్రాల గురించి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో రాడికల్ శక్తులకు సహాయం చేయడం, మైనారిటీలను రక్షించడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న బంగ్లా తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ దిగిపోతూ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 2024లో హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత యూనస్ అధికారం చేపట్టి బంగ్లాలో భారత వ్యతిరేకతను పెంచి పోషించాడు.
తాజాగా ఆయన చేసిన ప్రసంగంలో భారత్‌పై తన వ్యతిరేకతను వెల్లడించారు. విదేశాంగ విధానంలో బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, గౌరవం, స్వాతంత్య్రాన్ని తిరిగి పొందిందని, ఇకపై ఇతన దేశాల ఆదేశాలపై పనిచేయదని చెప్పారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు. భూటాన్, నేపాల్, ‘‘సెవెన్ సిస్టర్స్’’తో బంగ్లాదేశ్ అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. భారతదేశంలోని అంతర్భాగమైన 7 ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
Read Also: Reels Madness: శివుడికి గంజాయి ప్రసాదం.. యువకుల వికృత చేష్టలు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
తన హయాంలో చైనా, జపాన్, యూఎస్ఏ, యూరప్‌తో బంగ్లా సంబంధాలను పెంచానని, భారతదేశ వ్యూహాత్మక ‘‘సిలిగురి కారిడార్’’కు సమీపంలోని తీస్తా నదిపై చైనా సహాయంతో ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ సైన్యాన్ని విదేశాల దురాక్రమణను ఎదుర్కోవడానికి బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఇది భారత్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యగా పరిగణిస్తున్నారు.
తాజాగా జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సంచలన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్, బంగ్లాదేశ్ ప్రధానిగా ఫిబ్రవరి 17న ప్రమాణస్వీకారం చేశారు. అయితే, దిగిపోతూ కూడా యూనస్ తన భారత వ్యతిరేకతను దాచుకోలేదు. పరోక్షంగా భారత్‌తో బంగ్లా సంబంధాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!