స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నిజాం సాగర్ కాల్వలో పడి గల్లంతైన ఘటనలు చందూరుతో పాటు వర్ని మండలం అఫందీఫారంలో శనివారం చోటుచేసుకుంది. వర్ని, చందూర్ మండలాల్లోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గల్లంతయినట్లు వర్ని ఎస్సై కృష్ణ కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం తెలుగుదేశం - జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరుపార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు.
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు.
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
హనుమకొండ నగరంలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది..హనుమకొండ జిల్లా భీమారంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.