వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర ద్వారా తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు.
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా నార్డిక్ దేశాలు (ఉత్తర ఐరోపా, అట్లాంటిక్ దేశాలు) అత్యధిక స్కోర్‌లతో సంతోషకరమైన దేశాలలో ఉన్నాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ, స్టాలిన్ సోదరి కనిమొళి, ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. ఇటీవల తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఎన్టీవీతో మాట్లాడారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాలచర్ల గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న బండి శ్రీవల్లి(4) అనే చిన్నారి మృతి చెందింది.
డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఎంతగా జనాలకు మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రాచుర్యం పొందాక ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చేసుకుంటూ, మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్వామి వారు విహరించనున్నారు.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు.