Vanga Geetha: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. ఇటీవల తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఎన్టీవీతో మాట్లాడారు. పిఠాపురంలో పోటీ చేసే అంశంపై మాట్లాడే క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను కూడా పవన్ కల్యాణ్‌ని వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని అని అన్నారు. పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని పేర్కొన్నారు. 2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి. అది వంగా గీతా మెజారిటీ కోసం జరుగుతున్నాయి.
నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది. 2009లో పీఆర్పీ పిఠాపురంలో గెలిస్తే, ఆ తర్వాత కూడా జనసేన పోటీ చేసింది. పిలిస్తే పలికే వాళ్ళని ప్రజలు గెలిపిస్తారు. పవన్‌కి డబ్బుల గొడవ ఎందుకు?’ అని వంగా గీత పేర్కొన్నారు.
Read Also: Loksabha Elections 2024 : ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు
2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్‌సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్ నిన్న మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్ తాజాగా స్పందించారు. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్ పోటీ వేళ జనసేనకు ఇవాళ పెద్ద షాకే తగలబోతోంది. నియోజకవర్గ నేత మానినీడు శేషు కుమారి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆమె వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.