వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు...పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది.
పాకిస్థాన్ ఇస్లాం పేరుతో గల్ఫ్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది. కానీ పాకిస్థానీల చర్యలు మాత్రం మధ్యప్రాచ్యంలోని దేశాలు వారితో కేవలం బలవంతంతోనే సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పర్యాటకం వైపు దూసుకుపోతున్న యూఏఈ వంటి దేశాలు కూడా పాకిస్థానీలను స్వాగతించడానికి సిద్ధంగా లేవు.
హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది.
రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోంది. కాసేపట్లో ఎన్నికల సంఘం ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశించారు.
ఏపీల బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు చేరింది. పశ్చిమ సీటు జనసేనకు ఇవ్వాలని పోతిన మహేష్ వర్గం వారం రోజులుగా వరుస ఆందోళనలు చేపడుతోంది.
కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీకి రాజీనామా చేయాలని బెదిరించారని ఫిర్యాదు చేశారు కౌన్సిలర్ వెంకటలక్ష్మి.
నెల్లూరు జిల్లాలో దొంగలు తెగబడ్డారు. కావలిలోని వివిధ ఇళ్లలో చోరీ చేసిన బంగారాన్ని నెల్లూరులోని అటికా గోల్డ్‌లో దొంగలు అమ్మినట్లు తెలిసింది. ఈ అమ్మకానికి అటికా గోల్డ్ కంపెనీ ఉద్యోగి సల్మాన్ ఖాన్ సహకరించినట్లు విచారణలో తెలిసింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో నేతలు ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభిస్తున్నారు. వైనాట్ 175 దిశగా ఈ సారి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ప్రజలను ఆకట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు.
చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో మంగళవారం ప్రయాణికుల బస్సు సొరంగం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు.