బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌ను నోయిడా పోలీసులు రేవ్ పార్టీలో పాములను ఉపయోగించాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఇతగాడిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. గత ఏడాది రేవ్ పార్టీలలో పాము విషాన్ని వినోద ఔషధంగా వాడేందుకు ఏర్పాటు చేసినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైంది.
ఇజ్రాయెల్‌పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఖర్గే సొంత జిల్లా కలబురగి నుంచి ప్రారంభించినందున ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు భయపడుతున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కలబురగితో పాటు కర్ణాటకలోని 20 లోక్‌సభ స్థానాలను పార్టీ గెలుచుకోవడం ఖాయమని అన్నారు.
దాదాపు రెండేళ్ల కిందట దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పంజాబ్‌తో పాటు దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న 28 ఏళ్ల సింగర్ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది.
మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భారత్, శ్రీలంక,మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది.
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 10 మంది చిక్కుకున్నారు. అందులో ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
బీజేపీ తన అభ్యర్థుల రెండు జాబితాలను విడుదల చేసింది. దీంతో పాటు బీజేపీ కూడా కొత్త తరం నేతల సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల 70 ఏళ్లు పైబడిన వారిని కూడా అభ్యర్థులుగా నియమించారు, అయితే చాలా చోట్ల బీజేపీ సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను రద్దు చేసింది.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం అనుమానం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా సోమవారం తూర్పు సముద్రం వైపు పేర్కొనబడని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టు ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 113 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి మందన సేన అలవోకగా విజయం సాధించింది.
నంద్యాల జిల్లా డోన్‌లో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో 500 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరాయి.