కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశాడు.
భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.
తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కొట్లాడి 1000 కోట్ల నిధులు తెచ్చానని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు తప్పుడు ప్రకటనలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి సుప్రీంకోర్టులో కొత్త అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ అఫిడవిట్‌లో ఆర్డర్‌ను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించి పతంజలి వివరణాత్మక సమాధానం దాఖలు చేసింది.
మంగళవారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఎంపీ సైమన్ హారిస్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. 37 ఏళ్ల వయసులోనే ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు.
పాకిస్థాన్ అధికారం ఇస్లామాబాద్, రావల్పిండి నుంచి నడుస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ మాత్రం కరాచీ నుంచే నడుస్తోంది. అందుకే ఈ నగరాన్ని పాకిస్థాన్ ఆర్థిక రాజధాని అని పిలుస్తారు. కానీ పాకిస్తాన్ ఆర్థిక రాజధానిని నెల రోజులుగా బిచ్చగాళ్ళు ఆక్రమించారు.
వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్న వేధింపుల కేసుల్లో తమ భర్త బంధువులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా చాలాసార్లు మహిళలు ఇరికిస్తున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న భూతాల్లో ‘డ్రగ్స్’ ఒకటి. ముఖ్యంగా.. యువతీ యువకులు ఈ డ్రగ్స్‌కు బానిసలై, తమ ఉజ్వల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ.. దుండగులు అడ్డదారుల్లో ఈ డ్రగ్స్‌ని సరఫరా చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్వోటీ టీమ్ సీజ్ చేసింది.