Drugs: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న భూతాల్లో ‘డ్రగ్స్’ ఒకటి. ముఖ్యంగా.. యువతీ యువకులు ఈ డ్రగ్స్‌కు బానిసలై, తమ ఉజ్వల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ.. దుండగులు అడ్డదారుల్లో ఈ డ్రగ్స్‌ని సరఫరా చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్వోటీ టీమ్ సీజ్ చేసింది. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్‌ను ఎస్వోటీ స్వాధీనం చేసుకుంది. పుట్టిన రోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తుండగా ఎస్వోటీ అధికారులు 5 మంది యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బర్త్‌డే పార్టీలో ఆ యువకులు మత్తులో జోగినట్లు తెలిసింది. ఆ యువకులు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్ తో పాటు 5 మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.
Read Also: Road Accident: గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి!
గంజాయి పట్టివేత
రంగారెడ్డి జిల్లాలోని దుండిగల్‌లో గంజాయి పట్టుబడింది. 1.35 కేజీల గంజాయి మేడ్చల్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. గంజాయి విక్రయిస్తుండగా వల పన్ని ఎస్ఓటీ బృందం పట్టుకుంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కేటుగాళ్లు గంజాయి దందాకు తెరలేపినట్లు తెలిసింది.
విలాసాలతో ప్రారంభమై.. మాదకద్రవ్యాల ఉచ్చులో పడుతోంది నేటి యువత. నగరంలోనే కాదు.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో యువత మత్తు వలయంలో చిక్కుకుంటోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలై.. క్రమంగా ఆ అలవాటు మాదకద్రవ్యాల సేవనం వరకు ఇది దారితీస్తోంది. గంజాయి విక్రయాలు నగరం నలుమూలలా జరుగుతుండటం వల్ల యువతపై డ్రగ్స్ ప్రభావం అధికంగా ఉంటోంది. పరిస్థితి విషమించే వరకు చాలామంది తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల పలు కుటుంబాల వేదన వర్ణనాతీతంగా ఉంటోంది. తల్లిదండ్రులు పిల్లలను కాస్తా కనిపెడుతూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.