Boinapalli Vinod Kumar: తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కొట్లాడి 1000 కోట్ల నిధులు తెచ్చానని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, పార్టీ శ్రేణులతో కలిసి కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు. 5 సంవత్సరాల కాలంలో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి 5 పైసలు తేలేదని ఆయన విమర్శించారు.
Read Also: Nitish Reddy IPL 2024: పంజాబ్‌పై విధ్వంసం సృష్టించిన తెలుగు ఆటగాడు.. ఎవరీ నితీష్ రెడ్డి?
యూరియా, డీఏపీ బస్తాలపై మోడీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని బండి సంజయ్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని.. యూరియా, డీఏపీ బస్తాలపై గత ప్రభుత్వాల కాలం నుంచి సబ్సిడీ ఇస్తున్నారని ఆయన తెలిపారు. పచ్చి అబద్ధాలు, మోసాలు చెబుతూ బండి సంజయ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ రాష్ట్రంలో ఒక్క నవోదయ పాఠశాలను తీసుకురాలేదని విమర్శించారు. రూ. 2000 పెన్షన్‌ను రూ.4000 చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట ఎగ్గొట్టిందని, 500 కే గ్యాస్ అని సబ్సిడీకి కూడా ఉద్దేర పెట్టే నైజాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోందని విమర్శలు గుప్పించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్.