Mango Tree: సాధారణంగా మామిడి చెట్లకు ఒకే చోట నాలుగు నుంచి ఐదు వరకు గుత్తులుగా మామిడి కాయలు కాయడం చూస్తుంటాం. కానీ ఓ మామిడి చెట్టులోని కొమ్మకు ఒకే దగ్గర 55 కాయలు కాశాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలానికి చెందిన మోదాల గంగయ్య పొలంలో విరిగిపోయి ఎండిపోయిన మామిడి చెట్టు కొమ్మ మరల చిగురించింది. ఆ చిగురు మామిడి కాయల రూపములో ప్రతి ఫలించింది. ఆ చిగురే కాయల రూపంలో ప్రతి ఫలించి 55 మామిడి కాయలను కాసింది.
Read Also: Love Guru : నార్మల్ టికెట్ రేట్లకే విజయ్ ఆంటోని లవ్ గురు..
ఆ కాయలు కాసిన కొమ్మ కొన్ని రోజుల క్రితం ఎండిపోయింది. రైతు చెట్టుకు నీళ్లు పెట్టడం వల్ల ఎండిన కొమ్మ చిగురించింది. చెట్టు మొత్తం మీద ఈ కొమ్మకే కాయలు కాసినట్లు రైతు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకే దగ్గర 55 కాయలు కాయడం పట్ల రైతు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.