Amit shah: 2014 నుంచి భద్రత విషయంలో స్వర్ణయుగం నడుస్తోంది
- ఢిల్లీ పోలీసులు 79వ వ్యవస్థాపక దినోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా
- 2014 నుంచి దేశంలో స్వర్ణయుగం నడుస్తోందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2014 నుంచి 2026 వరకు దేశ అంతర్గత భద్రతకు స్వర్ణయుగంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ పోలీసులు 79వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘2014కి ముందు 3-4 దశాబ్దాలుగా మూడు సమస్యలు మన అంతర్గత భద్రతకు తీవ్రమైన సవాలుగా నిలిచాయి. కాశ్మీర్ ప్రాంతం, మొత్తం ఈశాన్య ప్రాంతం. పదకొండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్, ఈశాన్య, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హింసను 80 శాతం తగ్గించడంలో మేము విజయం సాధించామని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. 2026 మార్చి 31 నాటికి మొత్తం దేశాన్ని మావోయిస్టు హింస నుంచి విముక్తి చేయడంలో విజయం సాధిస్తామని నేను దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను..’’ అని అమిత్ అన్నారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్ అవుతోన్న కామెంట్
Also Read
ఈ సందర్భంగా పోలీసులు కవాతును నిర్వహించారు. ఢిల్లీ పోలీసుల అత్యుత్తమ మార్చింగ్ బృందం, SWAT బృందం, డాగ్ స్క్వాడ్, బ్యాండ్ బృందం, మోటార్ సైకిల్ రైడర్లు, PCR యూనిట్లు, అనేక ఇతర ప్రత్యేక బృందాలు సమన్వయంతో కూడిన మార్చ్ పాస్ట్‌ను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమాన్ని అమిత్ షా వీక్షించారు.
ఇది కూడా చదవండి: UP: తాళి కట్టే సమయంలో వధువు షాక్.. నిర్ఘాంతపోయిన పండితులు.. బంధువులు
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "From 2014 to 2026 will forever be marked in our history as a golden period for the country's internal security. Before 2014, three problems had posed a serious challenge to our internal security for 3-4 decades: the Kashmir… pic.twitter.com/4DtVgE3BWe
— ANI (@ANI) February 16, 2026
#WATCH | Delhi: Union Home Minister Amit Shah attends Delhi Police 79th Foundation Day event. pic.twitter.com/mcdPJ97dLe
— ANI (@ANI) February 16, 2026
తాజావార్తలు
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?