Rameshwaram Cafe Blast: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్‌ఐఏ కీలక పురోగతి సాధించింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. రామేశ్వరం కేఫ్‌లో బాంబు అమర్చిన నిందితుడు, ఉగ్రవాది షాజిబ్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ. నిశితంగా దర్యాప్తుతో పాటు నిఘా తర్వాత ఎన్‌ఐఏ అతడిని అరెస్ట్ చేసి ఈ కేసులో విజయం సాధించింది. చాలా నెలలుగా పరారీలో ఉన్న ఉగ్రవాదిని హుస్సేన్‌ను పట్టుకుంది. పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Read Also: Hyderabad Drugs: అమెజాన్ కొరియర్‌లో డ్రగ్స్ కలకలం.. 2 కేజీల గంజాయి సీజ్!
తెలంగాణ పోలీసుల సహకారంతో నిందితులను ఎన్ఐఏ పట్టుకుంది. అబ్దుల్ మతీన్, షాజిబ్ హుస్సేన్‌లను అధికారులు కోల్‌కతాలో పట్టుకున్నారు. తెలంగాణ, కేరళ ,కర్ణాటక పోలీసుల సహకారంతో నిందితుడిని పట్టుకున్నట్లు తెలిసింది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఈ ఇద్దరు నిందితులు కీలకంగా ఉన్నారు.పేలుడు కేసులో అబ్దుల్ మతీన్ మాస్టర్ మైండ్ అని గుర్తించారు. పేలుడుకి కుట్రధారిగా మాస్టర్ మైండ్ అబ్దుల్ మతీన్ అని ఎన్‌ఐఏ పేర్కొంది. అబ్దుల్ మతీన్ ఆదేశాల మేరకు షాజిబ్ హుస్సేన్‌తో కలిసి మరో ఇద్దరు ఈ పేలుడు జరిపినట్లు గుర్చించారు. రామేశ్వరం కేఫ్ పేలుళ్లు జరిపిన తర్వాత అస్సాం, కలకత్తాలో తలదాచుకున్నారు నిందితులు.నకిలీ పత్రాలు సృష్టించుకుని వేషధారణ మార్చుకొని పట్టుబడకుండా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
మార్చి 1న బెంగళూర్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, అప్పటి నుంచి నిందితుడిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), బెంగళూర్ క్రైం ఇన్వెస్టిగేషన్ టీం వెతుకుతూనే ఉన్నాయి. నిందితులను పట్టించిన వారికి రివార్డు కూడా ప్రకటించాయి. ఎట్టకేలకు బాంబు అమర్చిన నిందితుడిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది.