ఇండోనేషియాలోని జావా ద్వీపంలో హైస్కూల్ విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కారు, మూడు మోటార్‌సైకిళ్లను ఢీకొట్టడంతో 11 మంది మరణించగా.. చాలా మంది గాయపడ్డారు.
అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని దౌసాలో కారును ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మరణించడంతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
బెట్టింగ్‌కు బానిసై కోట్లు పోగొట్టిన కొడుకును కన్న తండ్రే రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్ పల్లిలో చోటుచేసుకుంది.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళనున్న సిబ్బంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 29.79 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో 17 లక్షల 97 వేల150 మంది ఓటర్లు ఉన్నారు.
ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచవ్యాప్తంగా 'అంతర్జాతీయ నర్సుల దినోత్సవం' జరుపుకుంటారు. ఈ నర్సుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది?.. ఈ సంవత్సరం థీమ్ ఏమిటో తెలుసుకుందాం.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్‌ను దాటేసినందుకు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడింది.
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ముగ్గురు కార్ డీలర్లను కిడ్నాప్ చేసి, వారి ప్రైవేట్ పార్ట్‌లపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆందోళనకరమైన వీడియోలు, కిడ్నాపర్లు నగ్నంగా ఉన్నప్పుడు పురుషుల ప్రైవేట్ భాగాలకు విద్యుత్ షాక్‌లు ఇస్తున్నట్లు చూపుతున్నాయి.