ఈ ఏడాది మే 12 తేదీ ప్రపంచంలో చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే.. ఈరోజు మదర్స్ డే. కానీ ప్రతి సంవత్సరం మే 12న మదర్స్ డే జరుపుకోరు. ఈ తేదీ మారుతూ ఉంటుంది. మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకునే ఆచారం మారదు.
భూ వైకుంఠంలో వెలసిన విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆర్మీ బ్యాండ్ మేళవింపుల నడుమ సంపూర్ణ ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణలు, బద్రీ విశాల్ లాల్ కీ జై అనే నినాదాలతో భక్తుల కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి.
వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని చెప్తే.. తాను, అమర్‌నాథ్ పోటీ నుంచి తప్పుకుంటామని అన్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో పోరాటం చేశానన్నారు.
రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సోదరుడు అని.. వాళ్ళిద్దరిది రాజకీయ సంబంధమే కాదు అన్నాతమ్ములు లాగా కలిసిమెలిసి ఉండేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కడపలో రాహుల్ ప్రసంగించారు.
చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పెత్తందారులకు ,పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటికి వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న
ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అగ్రనేతలంతా జోరుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీజాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి విచ్చేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉక్కపోత, వేడిగాలుల నుండి ప్రజలు త్వరలో ఉపశమనం పొందబోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్‌లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా దీన్ని ప్రముఖంగా ప్రచురించింది. డాన్ ఈ వార్తను హెడ్‌లైన్ చేసింది.