Karnataka Horror: ముగ్గురి కిడ్నాప్, వారి ప్రైవేట్ భాగాలపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు.. వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Horror: కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ముగ్గురు కార్ డీలర్లను కిడ్నాప్ చేసి, వారి ప్రైవేట్ పార్ట్‌లపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆందోళనకరమైన వీడియోలు, కిడ్నాపర్లు నగ్నంగా ఉన్నప్పుడు పురుషుల ప్రైవేట్ భాగాలకు విద్యుత్ షాక్‌లు ఇస్తున్నట్లు చూపుతున్నాయి. ముగ్గురు వ్యక్తులను దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన ఏడుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముగ్గురు కారు డీలర్లను కొంత మంది వ్యక్తులు నగ్నంగా తయారు చేసి కొట్టిన వీడియోలో కర్ణాటకలోని కలబుర్గి నగరంలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి, మే 5 న ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. 7 మంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Nijjar Murder Case: ఖలిస్థానీ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
Also Read
అరెస్టయిన వారిని ఇమ్రాన్ పటేల్, మహ్మద్ మతీన్ అలియాస్ స్టీల్ మతీన్, మహ్మద్ జియా ఉల్ హుస్సేన్, మహ్మద్ అఫ్జల్ షేక్, హుస్సేన్ షేక్, రమేష్, సాగర్‌లుగా గుర్తించారు. వీరు పెద్ద ముఠాలో భాగం కాగా, మిగిలిన సభ్యుల కోసం పోలీసులు వెతుకున్నారు. నిందితులు సెకండ్ హ్యాండ్ కారును తనిఖీ చేస్తున్నారనే నెపంతో మే 4న తమను కిడ్నాప్ చేశారని బాధితులు మే 5న రాత్రి 9.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏకాంత ప్రదేశంలో బందీగా ఉంచి, బాధితులను కర్రలతో భౌతిక దాడికి గురి చేసి డబ్బు కోసం బలవంతపెట్టారు. అదనపు నిధులు డిమాండ్ చేస్తూ నిందితులు బాధితులను మరింత హింసించారు.ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!