ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్ళడానికి జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఏపీలో పోలింగ్ తర్వాత కూడా దాడు ఆగడం లేదు. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లా స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. సాయంత్రం వరగ్గా ప్రశాంతంగా జరిగిన పోలింగ్.. 5 గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయిన టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు.
మంత్రి అంబటి రాంబాబు ఏపీ ఎన్నికల అధికారి(సీఈవో) ఎంకే మీనాను కలిశారు. పల్నాడులో పొలిటికల్ హింస మీద ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని.. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ఏపీలో ఎన్నికలు ముగిసినా గొడవలు మాత్రం ఆగడం లేదు. సోమవారం పోలింగ్ సమయంలో చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సోమవారం ముగిసింది. ఓటర్లు బస్సులు, ఫ్లైట్‌లు, రైళ్లలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండా వానను కూడా లెక్క చేయకుండా జనం ఓటేశారు. పలు చోట్ల హింసాత్మక దాడులకు కూడా భయపడకుండా ఏపీ ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును ఈవీఎం బాక్సులలో నిక్షిప్తం చేశారు.
ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి అక్కడే ఉండి.. రేపు ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఉదయం నుంచి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు స్పష్టంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ జరుగుతోందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ప్రతి చోటా 100 నుంచి 200 మంది ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.