Israel Attack on Rafah: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌క్లేవ్‌లోని 11, ఇతర పరిసరాలను ఖాళీ చేసి సురక్షిత మైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ మేరకు శనివారం ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి ఎక్స్(గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. గాజా నగరానికి పశ్చిమానా ఉన్న ఆశ్రయాలకు వెళ్లాలని సూచించారు. రఫాలో భారీ దాడి జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. రఫాపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేసినా తాజాగా ఇజ్రాయెల్ ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
Read Also: Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ ఎవరి వైపు..?
ఇదిలా ఉండగా.. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు రఫా నుంచి వెళ్లిపోయారని సమాచారం. హమాస్ ఉద్యమానికి చెందిన వేలాది మిలిటెంట్లను నిర్మూలించకుండా యుద్ధంలో విజయం సాధించలేమని ఇజ్రాయెల్ పేర్కొంటోంది. రఫాలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని.. అందుకే ఆ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని చెబుతోంది. అయితే రఫా నగరంపై దాడి చేస్తే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.
Read Also: Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడి హతమార్చేందుకు యత్నం.. చివరకు ఏమైందంటే..?
రఫాలో నివసించే ప్రజలు భయంతో పారిపోతున్నారు. తాము రఫాలో ఉండలేమని.. ఇజ్రాయెల్ సైన్యం నుంచి గాజాలో ఏ ప్రాంతం తప్పించుకోలేదని.. వారు ప్రతిదానిని లక్ష్యంగా చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. రఫాపై దాడి చేసినందుకు ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఇవ్వబోమని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. హమాస్‌తో ఒంటరిగా పోరాడతానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం పౌరులను రక్షించే అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని గణనీయమైన ఆధారాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం తెలిపింది.