Rajasthan: అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని దౌసాలో కారును ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మరణించడంతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా ఆవు రాగా.. వారు కారును రోడ్డు పక్కన ఆపారు. రోడ్డుపై కారును ఆపగా.. వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంతో సహా అహ్మదాబాద్ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వెళ్తుండగా.. దౌసాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగిందని డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి జవాన్ సింగ్ తెలిపారు.
Read Also: China : 16 ఏళ్ల క్రితం చైనాలో తలకిందులైన భూమి.. 87000 మంది మృతి
అంత్యక్రియలు చేసేందుకు హరిద్వార్ బయలుదేరగా.. వెనుక నుంచి ఒక ట్రక్కు ఢీకొట్టిందని కుటుంబ సభ్యుడైన నీలా మక్వానా వెల్లడించారు. ముగ్గురు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చగా, మృతదేహాలను బండికుయ్ ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసు అధికారి జవాన్ సింగ్ తెలిపారు.