గాజాలోని హమాస్ రాజకీయ విభాగం నాయకుడు, ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకరైన యాహ్యా సిన్వార్ రఫాలో లేరని, గాజా దక్షిణాన ఉన్న నగరంలో ఇజ్రాయెల్ తన దాడులతో ముందుకు సాగుతున్నప్పుడు ఇద్దరు అధికారులు చెప్పారు.
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్‌లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు.
అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠాను ఛేదించారు. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల నలుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు.
అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. అధునాతన అడిటీవ్ మాన్యుఫాక్చరింగ్(ఏఎం) సాంకేతికతను ఉపయోగించి పీఎస్4 లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది.
నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ సోమవారం అంటే మే 13న జరగనుంది.
భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం ప్రదర్శించే దేశంలో గుర్తింపు తెచ్చుకుంది. మన మతాన్ని పాటిస్తూనే ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం కేవలం భారతీయులకు మాత్రమే సొంతం. ప్రారంభం నుంచే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంకా అనేక మతాల వారు సోదర భావంతో జీవిస్తున్నారు.
నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తన ఎక్స్(గతంలో ట్విట్టర్) అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.
మరో 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని సీఎం అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు అని.. పొరపాటు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని ఆయన పేర్కొన్నారు.