Pawan Kalyan: ప్రధాని మోడీ నామినేషన్‌కు జనసేనాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనంతో పాటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఓటేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మంగళగిరిలో తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరో వైపు ఎన్నికల ముందు జనసేన, టీడీపీ కలిసి బీజేపీతో జతకట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కూటమి ప్రచారానికి ప్రధాని మోడీ పలు సార్లు రాష్ట్రానికి విచ్చేసి ఎన్డీయే కూటమిలో జోష్ నింపారు. చివరగా విజయవాడలో జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి రోడ్ షో నిర్వహించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది.. అంతిమ విజయం ప్రజలదే..
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
కాగా.. రేపు వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే వారణాసి చేరుకున్న ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసలు విషయమేమిటంటే.. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి అక్కడే ఉండి.. రేపు ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!