Sajjala Ramakrishna Reddy: ఉదయం నుంచి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు స్పష్టంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు. ఏపీలో పోలింగ్ సరళి చూస్తే ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటర్ల సరళి ఉప్పెనలా కనిపిస్తుందని.. ఇది చాలా అరుదన్నారు. అంతిమంగా ప్రజలది విజయం అవుతుందన్నారు. టీడీపీ గూండాలు రెచ్చిపోయారు.. ఏకపక్షంగా దాడులు చేశారన్నారు. పల్నాడు జిల్లాలో ఇవాళ అది పరాకాష్టకు చేరుకుందన్నారు. వైసీపీ సంయమనంతో ఉంది.. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి అనుకుందన్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడి.. దాడులకు పాల్పడిందని.. కొందరు పోలీసు అధికారులు కూడా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఏబీ వేంకటేశ్వర రావు టీడీపీ ఆఫీసులో ఉండి పోలీసు సిబ్బందిని భయపెట్టే పని చేశారని విమర్శించారు.
Read Also: AP CEO MK Meena: ఎన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు..
కొన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని.. కుప్పం, మాచర్ల, టెక్కలి, సత్తెనపల్లితో పాటు పలు నియోజకవర్గాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందన్నారు. ఇప్పటికే టీడీపీ రిగ్గింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజలకు జగన్ ,వైసీపీ తరపున ధన్యవాదాలు తెలిపారు. పార్టీ శ్రేణులు కూడా సంయమనంతో ఉన్నాయని.. వారికి కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.