ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ అంటూ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందన్నారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు.
సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలుసు. వేసవి కాలం మండే సూర్యుడిని మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన పండ్లను కూడా తీసుకువస్తుంది. ఈ రోజుల్లో ఫాల్సా పండ్లు మార్కెట్‌లో ఎక్కువగా విక్రయించబడడాన్ని మీరు చూసే ఉంటారు.
మన శరీరం మన ఆరోగ్యానికి ప్రతిరూపం. శరీరంలో కనిపించే లక్షణాల సహాయంతో మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది తేలికగా అంచనా వేసుకోవచ్చు. మన ముఖం నుంచి కళ్ళ వరకు అన్నింటి సహాయంతో మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. మంగళవారం తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు.
రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడ్డామన్న సీఎం హామీలను ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం ముఖ్యమంత్రిపై మహిళలలో పెరగడం వల్ల నిన్న ఎద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్నారు.