PM Modi: వచ్చే వారం రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
- జులై 8 నుంచి 10 వరకు రష్యా..ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
- 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న ప్రధాని
- ఆస్ట్రియా అధ్యక్షుడితో సమావేశం కానున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాల్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 , జులై 9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు. ఇరు దేశాల నాయకులు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను సమీక్షించుకోనున్నారు. పరస్పర ఆసక్తి ఉన్న సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారని అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: Moscow: మాస్కోను ఠారెత్తిస్తున్న ఎండలు.. వందేళ్ల రికార్డ్ బద్దలు
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
ఫిబ్రవరి 2022లో తన సైనిక దాడిని ప్రారంభించి పొరుగుదేశమైన ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి ప్రధాని మోడీ రష్యాకు పర్యటన కోసం వెళ్లడం ఇదే మొదటి సారి. 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సుకు చివరిసారికి రష్యాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు.అప్పటి నుంచి ఇప్పటివరకు రష్యాలో పర్యటించకపోవడం గమనార్హం. రష్యాలో తన శిఖరాగ్ర సమావేశం అనంతరం ప్రధాని మోడీ జులై 9, జులై 10 తేదీలలో ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. 41 ఏళ్లలో యూరోపియన్ దేశంలో భారత ప్రధాని చేసే మొదటి పర్యటన ఇది. వియన్నాలో ప్రధాని మోడీ ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెతో సమావేశమై, ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, నెహమ్మర్ ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తాజావార్తలు
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
-
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!