Minister Satyakumar Yadav: ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు
- ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు
- ముందుకొచ్చిన అబుదాబికి చెందిన ఎం42 సంస్థ ప్రతినిధులతో ప్రాథమికస్థాయి సమావేశం
- క్షేత్ర స్థాయిలో ఎంఎఫ్2 సంస్థ ప్రతినిధులు పర్యటించాక మరలా సమావేశం
- తుది నివేదిక అనంతరం ఎంఓయూ
- వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satyakumar Yadav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని అబుదాబికి చెందిన ఎంఎఫ్2 సంస్థ ప్రతినిధులకు వివరించామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళగిరి ఏపిఐఐసీ టవర్స్లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో గురువారం సమావేశమైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశమున్న రంగాలపై జినోమిక్స్, పర్యావరణ మెడ్ టెక్, బయోటెక్ విభాగాల్లో అపారమైన అనుభవమున్న ఎంఎఫ్2 సంస్థతో ప్రాథమికంగా చర్చించామన్నారు. వ్యాపారపరంగా, సేవా పరంగా ఏపీలో ఉన్న అవకాశాల్ని సంస్థ ప్రతినిధులకు వివరించామన్నారు. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని, అలాగే సుమారు 170 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏపీ మెడ్ టెక్ జోన్, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 ఎకనమిక్ జోన్లలో పెట్టుబడులు పెట్టేందుకు మెండుగా ఉన్న అవకాశాలపైనా వారితో చర్చించామన్నారు. అమరావతి ప్రాంతంలో హెల్త్ సిటీలో గానీ, ఎంపిక చేసిన 9 మునిసిపాలిటీల్లో హెల్త్ హబ్ లలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందని మంత్రి సత్యకుమార్ చెప్పారు.
Read Also: Amaravathi: అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌కు కేంద్ర మంత్రి గ్రీన్‌సిగ్నల్!
Also Read
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
ఆసుపత్రుల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని కనబర్చడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చే సరికొత్త టెక్నాలజీ అయిన జీనోమ్ సీక్వెన్సీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చిందన్నారు. ఎకనమిక్ కారిడార్లు, మెడ్ టెక్ జోన్ లలో ఎంఎఫ్2 ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటన చేశాక సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించిన మీదట తుది నివేదికను అందజేస్తారన్నారు. పలు దఫాలుగా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలాన్ని అందజేస్తామని సంస్థ ప్రతినిధులకు చెప్పామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని, అవసరమైన రాయితీల్ని కూడా ఇస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెట్టుబడిదారులు సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై వారెంతో ఉత్సాహాన్ని కనబర్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకుని పెట్టుబడులు పెట్టేందుకు మందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఎంఎఫ్2 సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యన్.యువరాజ్, ఏపీఎంఎస్ఐడీసీ ఎం.డి లక్ష్మీ షా సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!